మరో క్రేజీ కాంబో..ఇదే గనుక జరిగితే..డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో జాతర

మరో క్రేజీ కాంబో..ఇదే గనుక జరిగితే..డార్లింగ్ ఫ్యాన్స్ కు మరో జాతర

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు  ప్రభాస్. మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ పూర్తి చేసే పనిలో ఉన్న ఆయన.. తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘స్పిరిట్’, హను రాఘవపూడితో ఓ సినిమా చేయాల్సి ఉంది. అలాగే   సలార్ సీక్వెల్,  కల్కి సీక్వెల్  కూడా ఉన్నాయి.  తాజాగా ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చేయబోయే దర్శకుల లిస్టులో మరొకరు చేరబోతున్నట్టు తెలుస్తోంది.  తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పిన స్టోరీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది.

దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్టుల లిస్టులో ఇది కూడా చేరనుండటంతో ఆయన అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు.  త్వరలోనే  ఈ క్రేజీ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అధికారిక ప్రకటన వస్తుందని ప్రచారం జరుగుతోంది.  ఖైదీ, విక్రమ్ మాస్టర్, లియో లాంటి సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ సినిమాలు తీసిన లోకేష్..

ప్రస్తుతం రజినీకాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘కూలీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది పూర్తయ్యాకే ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవీపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది.  అయితే ప్రభాస్ చేతిలోనూ నాలుగైదు ప్రాజెక్టులు ఉండటంతో  ఈ కాంబో ఎప్పుడు మొదలవుతుంది అనే దానిపై చర్చ జరుగుతోంది.