ఇంకో 12 నెలల్లో 26,820 కి నిఫ్టీ : ప్రభుదాస్ లీలాధర్

ఇంకో 12 నెలల్లో 26,820 కి నిఫ్టీ : ప్రభుదాస్ లీలాధర్

న్యూఢిల్లీ: నిఫ్టీ ఇంకో 12 నెలల్లో 26,820 లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుందని బ్రోకరేజ్ కంపెనీ ప్రభుదాస్ లీలాధర్ అంచనా వేసింది. గతంలో  వేసిన 26,398 నుంచి పెంచింది.  బుల్‌‌‌‌‌‌‌‌  మార్కెట్ ఉంటే నిఫ్టీ 28,564 లెవెల్‌‌‌‌‌‌‌‌ను టచ్ చేస్తుందని, బేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్ ఉంటే 24,407 లెవెల్‌‌‌‌‌‌‌‌కు పడిపోతుందని తన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌గా జియో పొలిటికల్ టెన్షన్లు కొనసాగుతున్నా, ఇండియన్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని ప్రభుదాస్ లీలాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొంది. 

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు తగ్గాయని, డొమెస్టిక్ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు జరుపుతున్నారని వివరించింది. డిమాండ్ పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయని, ఫెస్టివల్ సీజన్‌‌‌‌‌‌‌‌లో పుంజుకునే ఛాన్స్ ఉందని పేర్కొంది. ప్రభుత్వ క్యాపెక్స్ పెరగడం, ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లేషన్ 4 శాతం దిగువకు రావడం, ఫెడ్‌‌‌‌‌‌‌‌ వడ్డీ రేట్లను తగ్గించడానికి రెడీ అవ్వడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో మార్కెట్‌‌‌‌‌‌‌‌కు కలిసొస్తుందని అంచనా వేసింది.