LIK OTT: ప్రైమ్ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ LIK మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

LIK OTT: ప్రైమ్ వీడియోలో ప్రదీప్ రంగనాథన్ LIK మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోలీవుడ్ యంగ్ హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ప్రస్తుతం మామూలుగా లేదు. 'లవ్ టుడే', 'డ్యూడ్' వంటి వరుస హిట్లతో యూత్ ఐకాన్‌గా మారిన ప్రదీప్.. రీసెంట్గా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో వచ్చి సత్తా చాటాడు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్‌ 10న విడుదలైన ఈ మూవీ, మే 6 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె. సూర్య విలన్గా నటించాడు. ఈ మూవీ తొలి మూడు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.60 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.43 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. 

కథేంటంటే?

ఈ సినిమా కథ చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ మూవీలో హీరో తన నిజమైన ప్రేమను వెతుక్కునే క్రమంలో ఒక గ్యాడ్జెట్ సహాయంతో 2040లోకి టైమ్ ట్రావెల్ చేస్తాడు. మనసులోని భావాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోకి, భవిష్యత్తులో అన్నీ యాప్స్, టెక్నాలజీతో ముడిపడి ఉన్న ప్రపంచం కనిపిస్తుంది. మరి ఒక యాప్ మనిషి హృదయాన్ని రీప్లేస్ చేయగలదా? టెక్నాలజీ ప్రేమను కొలవగలదా? అనే ప్రశ్నల చుట్టూ వినోదభరితంగా సాగే ప్రయాణమే ఈ చిత్రం. సోషల్ మీడియాకు అలవాటు పడిన హీరోయిన్ దీమా (కృతిశెట్టి) ఈ యాప్ ద్వారా తనకు సరైన పార్ట్నర్‌ను వెతుక్కుంటుంది. మరోవైపు ఫోన్ వాడకానికే దూరంగా ఉండే ప్రదీప్, ఆమెను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కోసం తన జీవితాన్ని మార్చుకుని, ఎల్‌ఐకే యాప్‌లో చేరతాడు. అయితే యాప్ ఇచ్చిన ‘లవ్ స్కోర్’ తక్కువగా రావడంతో దీమా అతనితో బ్రేకప్ చెబుతుంది. మొత్తంగా..‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ద్వారా యువత ప్రేమ, బ్రేకప్‌లను యాప్ ఆధారంగా నిర్వహించే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. విఘ్నేష్ శివన్ పాతకాలపు ప్రేమకథను ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్‌తో జోడించి అద్భుతంగా తెరకెక్కించారు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది.