సూపర్‌‌బెట్ చెస్ క్లాసిక్స్ టోర్నమెంట్‌‌లో టాప్‌‌లోనే ప్రజ్ఞానంద

సూపర్‌‌బెట్ చెస్ క్లాసిక్స్ టోర్నమెంట్‌‌లో టాప్‌‌లోనే ప్రజ్ఞానంద

బుకారెస్ట్: సూపర్‌‌బెట్ చెస్ క్లాసిక్స్ టోర్నమెంట్‌‌లో ఇండియా గ్రాండ్ మాస్టర్‌‌‌‌ ఆర్. ప్రజ్ఞానంద సత్తా చాటుతున్నాడు. మంగళవారం రాత్రి జరిగిన ఆరో రౌండ్‌‌లో నల్లపావులతో ఆడిన ప్రజ్ఞా  పోలెండ్ ఆటగాడు డుడా జాన్‌‌తో డ్రా చేసుకున్నాడు. మొత్తం 3.5 పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి టాప్‌‌లో కొనసాగుతున్నాడు. 

కానీ వరల్డ్ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌ ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజాతో  చేతిలో ఓడిపోయాడు. ఎండ్‌‌గేమ్‌‌లో ఈ పరాజయంతో గుకేశ్‌‌ వరల్డ్ ర్యాంకింగ్స్‌‌లో ఐదో స్థానానికి పడిపోయాడు. తెలంగాణకు చెందిన ఎరిగైసి అర్జున్‌‌ మూడో స్థానంలోకి వచ్చాడు.