తాత కోసం రిజైన్ చేస్తా : దేవెగౌడ మనవడు ప్రజ్వల్

తాత కోసం రిజైన్ చేస్తా : దేవెగౌడ మనవడు ప్రజ్వల్

దేవెగౌడ కోసం సీటు వదులుకునేందుకు సిద్ధమైన ప్రజ్వల్

బెంగళూరు:  మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ రాజీనామాకు సిద్ధమయ్యారు. తాత కోసం హాసన్ లోక్ సభ సీటును వదులుకుంటానని శుక్రవారం ప్రకటించారు. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ హాసన్ లో మాత్రమే గెలిచింది. కర్నాటక సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ మండ్య లోక్ సభ  సీటులో ఇండిపెండెంట్ అభ్యర్థి సుమలత చేతిలో ఓడిపోయారు. మనవడి కోసం దేవెగౌడ తన సొంత నియోజకవర్గం హాసన్ కు బదులుగా తుమకూరులో పోటీ చేసి ఓడిపోయారు. తాత ఓటమితో నిరాశకు గురైనట్లు కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ చెప్పారు. “నేను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నా. తాత ఎంపీగా గెలిచేందుకు నా సీటును వదులుకుంటా. పార్టీ నా రాజీనామాను ఆమోదించాలి” అని ప్రజ్వల్ అన్నారు.