మహారాష్ట్రలో కీలక పరిణామం : కాంగ్రెస్ పార్టీకి ప్రకాష్ అంబేద్కర్ మద్దతు..

మహారాష్ట్రలో కీలక పరిణామం : కాంగ్రెస్ పార్టీకి ప్రకాష్ అంబేద్కర్ మద్దతు..

ముంభైలో రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర తర్వాత కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని 7 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వంచిత్ బహుజన్ ఆఘడి పార్టీ ప్రకటించింది. ఈ విషయాన్ని VBA వంచిత్ బహుజన్ ఆఘడి (విబిఎ) పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్  మంగళవారం ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.  అదేవిధంగా  శరద్ పవార్, ఉద్ధవ్‌లపై ప్రకాష్ అంబేద్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. థాకరే తన పార్టీ ప్రయోజనాలను విస్మరిస్తోందని మండిపడ్డారు. దీంతో మహారాష్ట్ర ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)లో అసమ్మతి స్పష్టమైంది. 

ఈ మేరకు ప్రకాశ్ అంబేద్కర్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖను తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఎంవీఏలో కాంగ్రెస్‌కు కేటాయించిన కోటాలో 7 నియోజకవర్గాల పేర్లను చేర్చాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కోరారు. మహారాష్ట్రలో ఏడు స్థానాలకు తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తానని అందులో పేర్కొన్నారు. మార్చి 17న జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సభలో ఆయన కొన్ని కారణాల వల్ల పాల్గొనలేకపాయానని లేఖలో రాశారు. బీజేపీకి వ్యతిరేకంగా వారి పార్టీ గట్టిగా పోరాడుతుందని ప్రకాశ్ స్పష్టం చేశారు. 

Also Read :హేమంత్ సోరెన్ కు బిగ్ షాక్.. పార్టీకి రాజీనామా చేసిన సొంత వదిన