ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాశ్ రాజ్ స్టేట్మెంట్ రికార్డు చేసింది CID సిట్ టీమ్. 2025 నవంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 3.00 గంటల సమయంలో హైదరాబాద్ లోని సీఐడీ ఆఫీసుకు వచ్చిన ఆయన నుంచి వివరాలు సేకరించింది సిట్.
ఈ సందర్భంగా అధికారుల ముందు స్టేట్ మెంట్ ప్రకాశ్ రాజ్.. 2016 లో బెట్టింగ్ యాప్ క ప్రమోట్ చేశానని అన్నారు. 2017 లో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం విధించారని.. ఆ తర్వాత రియలైజ్ అయినట్లు చెప్పారు. అప్పట్నుంచి మళ్ళీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయలేదని తెలిపారు.
►ALSO READ | Kajol: పెళ్లికి ఎక్స్ పైరీ డేట్ ఉంటే ఎంత బాగుండో.. కాజోల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం!
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టపడి డబ్బు సంపాదించాలని.. యువతకు కూడా అదే చెప్తున్నానని అన్నారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకండని సూచించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో నేను తప్పు చేయలేదని అనడం లేదు. తెలిసి చేసినా.. తెలియక చేసినా.. తప్పు తప్పే.. ఇకపై చేయను.. అన్ని వివరాలు CID అధికారులకు సమర్పించాను..ED విచారణ కూడా ఎదుర్కొన్నాను.. బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాను.. అని అన్నారు ప్రకాశ్ రాజ్.
