Preeti Case : యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రారంభం

Preeti Case : యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రారంభం

వరంగల్ లో ఇటీవల చోటుచేసుకున్న డాక్టర్ ప్రీతి ఆత్మహత్యపై కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. పన్నెండు మందితో సమావేశమైన ఈ కమిటీకి కేఎఎసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్డీవో, ఏసీపీ, హెచ్ఓడీలు, ఒక స్టూడెంట్ ప్రతినిధి, స్టూడెంట్స్ పేరెంట్ ఒకరు హాజరయ్యారు. ఇప్పటికే కాకతీయ మెడికల్ కాలేజీకి,  ఎన్ఎంసీ, జాతీయ ఉమెన్స్ రైట్స్, ప్రొటెక్షన్ కమిటీ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కేఎంసీ అధికారులను కమిటీలు నివేదిక కోరాయి. -ర్యాగింగ్ నిర్మూలనపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలపై విశ్లేషించి యాంటీ ర్యాగింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నిందితుడు సైఫ్ పై నమోదైన కేసులు... తీసుకోవాల్సిన చర్యలు... మళ్ళీ ర్యాగింగ్ ఘటనలు జరగకుండా చర్యలపైనా చర్చ సాగనున్నట్టు తెలుస్తోంది.