రోజంతా కరెంట్​, చక్కటి చదువులు

రోజంతా కరెంట్​, చక్కటి చదువులు

ఆప్ మేనిఫెస్టోలో ప్రాధాన్యం
రిలీజ్ చేసిన డిప్యూటీ
సీఎం మనీశ్ సిసోడియా
న్యూఢిల్లీఅధికార ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) మంగళవారం మేనిఫెస్టోను రిలీజ్​ చేసింది. చక్కటి చదువులు, పరిశుభ్రమైన నీరు, రోజంతా కరెంట్​ లాంటి హామీలతో  కూడిన “28 పాయింట్ల గ్యారెంటీ కార్డు’’ను ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా విడుదల చేశారు.  ఐశ్వర్యంతో, డిగ్నిటీతో  ప్రతి సామాన్యుడూ  బతకాలన్నదే ఆప్​ విజన్​ అని సిసోడియా చెప్పారు.  మేనిఫెస్టో రిలీజ్​ కార్యక్రమంలో  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పార్టీ సీనియర్​ నేతలు  గోపాల్​రాయ్​, సంజయ్​ సింగ్​ తదితరులు   పాల్గొన్నారు.

బీజేపీకి కేజ్రీవాల్​ సవాల్​

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ బీజేపీకి సవాల్​ విసిరారు.  ముఖ్యమంత్రి కేండిడేట్​ పేరును ప్రకటించాలని బీజేపీని  డిమాండ్​ చేశారు.  “బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటవరకు బీజేపీకి టైమ్​ ఇస్తా.  సీఎం కేండిడేట్​ను ఆపార్టీ ప్రకటించకపోతే  మరొక  ప్రెస్​మీట్​ పెడతాను ”అని  కేజ్రీవాల్ చెప్పారు. ​ మంగళవారం  ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.  “ ఢిల్లీ  ఓటరు తీర్పు రాగానే సీఎం కేండిడేట్​ పేరును ప్రకటిస్తానని అమిత్​ షా చెబుతున్నారు. బీజేపీకి ఓటేయాలంటే ఆపార్టీ చీఫ్ ​మినిస్టర్​ ఎవరని ఢిల్లీ ప్రజలు అడుగుతున్నారు. చదువులేనివారు, సామర్థ్యంలేని వ్యక్తిని ప్రకటిస్తే   పరిస్థితి ఏంటి?  అది ఢిల్లీ ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుంది’’ అని కేజ్రీవాల్​ వివరించారు. కేంద్రం పార్టీ సాధించిన విజయాలను ఆధారంగా ప్రధాని నరేంద్రమోడీ పేరుతోనే బీజేపీ చాలా ఎన్నికల్లో ప్రచారంచేసింది.  కీలకమైన ఉత్తరప్రదేశ్ లాంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రి కేండిడేట్​పేరును బీజేపీ ​ముందుగా ప్రకటించలేదు.  ఆపార్టీ భారీ మెజార్టీ సాధించిన తర్వాత మాత్రమే యోగీ ఆదిత్యనాథ్​ పేరు సీఎంగా ప్రకటించారు.  దీనిని దృష్టిలో పెట్టుకునే కేజ్రీవాల్​ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు.

సవాల్​కు రెడీ: బీజేపీ

కేజ్రీవాల్​ సవాల్​ను స్వీకరిస్తున్నట్టు బీజీపీ ఢిల్లీ చీఫ్​ మనోజ్​ తివారీ చెప్పారు.  మేనిఫెస్టోపై  కేజ్రీవాల్​తో డిబేట్​కు తాము రెడీ గా ఉన్నామని ఆయన చెప్పారు.  డిబేట్​ ఎక్కడ, ఎప్పుడు పెడతారో కేజ్రీవాల్​ చెప్పాలని తివారీ  నిలదీశారు.

మేనిఫెస్టో హైలైట్స్
మంచి చదువులు 
పరిశుభ్రమైన నీరు.. రోజంతా కరెంట్​
ఇంటికే నేరుగా రేషన్​ సప్లయ్​
10 లక్షల మంది ముసలివాళ్లకు ఫ్రీగా తీర్థయాత్రలు
డ్యూటీలో  సఫాయీ కార్మికుడు చనిపోతే కుటుంబ సభ్యులకు  కోటి రూపాయల నష్టపరిహారం.
వరల్డ్​ క్లాస్​ రోడ్లు.. పూర్తిస్థాయి రాష్ట్రంగా ఢిల్లీ
స్కూళ్లలో దేశభక్తికి సంబంధించిన సిలబస్​
స్టూడెంట్స్​కు స్పోకెన్​ ఇంగ్లీష్​, పర్సనాలిటీ డెవలప్​మెంట్​ క్లాసులు
ముఖ్యమైన కమర్షియల్ ఏరియాల్లో  పైలట్​ బేసిస్​గా  రోజంతా మార్కెట్లు

మరిన్ని వార్తల కోసం..