Mamitha Baiju: ఐ లవ్ రామ్ చరణ్.. ప్రేమలు ఫేమ్ మమిత బైజు కామెంట్స్ వైరల్

Mamitha Baiju: ఐ లవ్ రామ్ చరణ్.. ప్రేమలు ఫేమ్ మమిత బైజు కామెంట్స్ వైరల్

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తెగ పాపులర్ ఐన చిన్న సినిమా ప్రేమలు(Premalu). మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం రూ.100 కోట్ల కలెక్షన్స్ కు చేరువలో ఉన్న ఈ సినిమా త్వరలో తెలుగులో కూడా విడుదల కానుంది. దర్శధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ ఈ సినిమాను మార్చ్ 8న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. దీంతో ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి హైప్ క్రియేట్ అవుతోంది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ సినిమాలో నటించిన మమిత బైజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రేమలు రిలీజ్ తరువాత ఆమె ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. అంతేకాదు చాలా మంది కుర్రాళ్ళకి లేటెస్ట్ క్రష్ లిస్టులోకి కూడా చేరిపోయింది. ప్రేమలు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రేమలు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. తెలుగులో తన అభిమాన హీరో ఎవరు అని యాంకర్ ప్రశ్నించారు.

దానికి సమాధానంగా మమిత మాట్లాడుతూ.. నాకు రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన నటించిన మగధీర సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు. ఆ సినిమా కోసం ప్రతీ శనివారం టైం టేబుల్ వేసుకొని మరీ చూసేదాన్ని. ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాడిపెట్టేదాని కాదు. ఒక్కసారైనా ఆయనతో కలిసి నటించాలనేది నా కొరక. ఐ లవ్ రామ్ చరణ్.. అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది ఈ యంగ్ బ్యూటీ. ప్రస్తుతం మమిత రామ్ చరణ్ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఆమె కోరిక నెరవేరి రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశం దక్కించుకుంటుందా చూడాలి.

Also Read : క్రాక్స్ వేస్కొని మిడిల్ క్లాస్ అంటావేంటన్నా.. విజయ్ కౌంటర్ అదుర్స్