కాన్వాలో ఇన్వెస్ట్​ చేస్తున్న అజీమ్ ప్రేమ్‌‌జీ ?

కాన్వాలో ఇన్వెస్ట్​ చేస్తున్న అజీమ్ ప్రేమ్‌‌జీ ?

న్యూఢిల్లీ: విప్రో ఫౌండింగ్​ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌‌జీ ఫండ్ ప్రేమ్‌‌జీ ఆస్ట్రేలియన్ గ్రాఫిక్ డిజైన్ ప్లాట్‌‌ఫామ్ కాన్వాలో 50-–70 మిలియన్ల డాలర్లు పెట్టుబడి పెడతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది కాన్వా  ఇటీవలి సెకండరీ సేల్​లో భాగం. 

ఇక్కడ 26 బిలియన్ల డాలర్ల విలువతో 1.6 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లు ప్రస్తుత,  కొత్త వాటాదారుల మధ్య చేతులు మారాయి. విక్రయంలో ఉద్యోగులు టెండర్ చేసిన షేర్లను ప్రేమ్‌‌జీ ఇన్వెస్ట్ తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కంపెనీ రాబోయే రెండేళ్లలో ఐపీఓకి కూడా వస్తోందని తెలిసింది.