
హైదరాబాద్, వెలుగు: ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ స్కిల్లింగ్ ప్లాట్‌ఫామ్ ప్రెప్ఇన్స్టా, తెలంగాణ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్స్ కన్సార్టియం (టీటీపీఓసీ) 2025లో పాల్గొన్నట్లు ప్రకటించింది. మెరుగైన ప్లేస్‌మెంట్ ఫలితాలను సాధించడానికి విద్యాసంస్థలు (అకాడెమియా), పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కాలేజీ స్టూడెంట్లకు, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ద్వారా వారిని ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధం చేస్తామని ప్రెప్ఇన్స్టా తెలిపింది. టీటీపీఓసీ 2025 వంటి వేదికల ద్వారా విద్యాసంస్థలతో తమ సహకారం మరింత బలోపేతమవుతుందని ప్రెప్ఇన్స్టా తెలిపింది.
తద్వారా విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ, ప్లేస్‌మెంట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. తాము ఇప్పటికే దేశవ్యాప్తంగా 300కు పైగా విద్యాసంస్థలతో భాగస్వామ్యం చేసుకుని, విద్యార్థులకు ప్లేస్‌మెంట్, అప్‌స్కిల్లింగ్ కోర్సులను అందిస్తున్నామని పేర్కొంది.