గ్రామీణ వృత్తులను కాపాడుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గ్రామీణ వృత్తులను కాపాడుకోవాలి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

యాదాద్రి భువనగిరి జిల్లా  భూదాన్ పోచంపల్లిలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటించారు. డిసెంబర్ 20వ తేదీ బుధవారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన రాష్ట్రపతికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలోని రంజన్ వేవ్స్ సిల్క్ ఇండస్ట్రీని రాష్ట్రపతి సందర్శించి, పట్టు ధారాల తయారీ ప్రక్రియను పరిశీలించారు.  బాలాజీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన చేనేత థీమ్ పెవిలియన్ ను పరిశీలించారు.  పోచంపల్లి ఇక్కత్ చీరలను, స్టాళ్లను కూడా పరిశీలించారు.  అనంతరం 302 మంది చేనేత కార్మికులతో సమావేశమై రాష్ట్రపతి ప్రసంగించారు.

రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కామెంట్స్

• చేనేత వృత్తి ద్వారా 36 లక్షల మంది కార్మికులు వృత్తిలో ఉన్నారు
•  చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుంది.
• తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుంది..
• పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాల కు TIG  ట్యాగ్ రావడం అభినందనీయం
• పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది.
• భారత సంస్కృతి సంప్రదాయాల్లో  చేనేత ఒకటి.
• UNWTO భూధాన్  పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయం 
• ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుంది.
• చేనేత కార్మికుల కృషి గొప్పది.. కళను, వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పది, అభినందనీయం
• చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలి.
• చేనేత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా
• గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలి 
• మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తా