
- ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ కూచూకుళ్ల దామోదర్ రెడ్డి
- నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు ప్రారంభం
అమ్రాబాద్, వెలుగు: శిక్షణ ద్వారా జర్నలిస్టులు నైపుణ్యాన్ని పెంచుకుంటారని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని మన్ననూరు గ్రామంలోని అటవీశాఖ వనమాలిక వద్ద తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం, అటవీశాఖ సౌజన్యంతో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కూచూకుళ్ల దామోదర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. శిక్షణా తరగతులు ములుగు జిల్లాలో ప్రారంభించాలని అనుకున్నామని కొన్ని టెక్నికల్ సమస్యలతో నల్లమల్ల ప్రాంతం నుంచి ప్రారంభిస్తున్నామన్నారు.
దాదాపు 150 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు శిక్షణ తరగతులకు తమ పేర్లు నమోదు చేసుకున్నారన్నారు. ప్రధానంగా జర్నలిజంలో ఎదురవుతున్న సమస్యలు, తదితర అంశాలపై క్లాసులు ఉంటాయన్నారు. సమాజానికి క్వాలిటీ జర్నలిజం అవసరం అన్నారు. -ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలన్నారు. ప్రజాసమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి దోహదపడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ప్రముఖ సంపాదకుడు కే. శ్రీనివాస్, విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వీ రామారావు, ఐజేయూ జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి, రాములు
పాల్గొన్నారు.