ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయల్లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అప్పర్ అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు …బ్రహ్మపుత్రా నది ఉప్పొంగుతోంది. సోనిత్ పూర్ జిల్లాలో జియా భరాలీ నది, జోర్హాట్ జిల్లాలో బ్రహ్మపుత్రా నది.. డేంజర్ లెవెల్ ను దాటి ప్రవహిస్తోంది. తీన్ సుఖియా జిల్లాలోని బ్రహ్మపుత్ర ఉప నదులైన నోవా-డిహింగ్, డిబ్రూ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి .
ధేమాజీ, లఖింపూర్, డారంగ్, నల్బరీ, గోల్ పారా, డిబ్రూగఢ్, తీన్ సుఖియా జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ 7 జిల్లాల్లోని …2లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. గోల్ పారా జిల్లాలో.. 35 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి 8వేల 971 మందిని తరలించారు. 14వేల జంతువులు కూడా వరదలతో అఫెక్ట్ అయ్యాయి. పౌల్ట్రీ రంగంపైనా తీవ్ర ప్రభావం పడింది. 2వేల 500 ఎకరాల పంట నీట మునిగింది.
అస్సాం పొరుగు రాష్ట్రమైన మేఘాలయలోనూ వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు 8 జిల్లాల్లోని 21 గ్రామాలపై ప్రభావం పడింది. బీభత్సంగా వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వెస్ట్ గారో హిల్స్, నార్త్ గారో హిల్స్, వెస్ట్ ఖాసీ హిల్స్, సౌత్ గారో హిల్స్, జైంతియా హిల్స్ జిల్లాల్లో …వరదల ప్రభావం ఉంది. మేఘాలయ లో డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
For More News..
నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..
భూములు పాయే.. ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..
రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

