వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్

వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్

ఇటీవలి కాలంలో భారీగా పెరిగిపోయిన గ్యాస్ సిలిండర్ల ధరలు నేటి నుంచి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ముడిచమురు ధరలు భారీగా తగ్గిపోవడంతో... దేశీయ చమురు సంస్థలు సైతం వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ విడుదల చేసిన ధరల ప్రకారం... నేటి నుంచి 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1976 ఉన్న వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1884కు తగ్గింది. ఈ ధర హైదరాబాద్ లో రూ.2099.5 కు చేరింది.

ఇదే తరహాలో నేటి నుంచి గ్యాస్ సిలిండర్ ధర కోల్ కత్తాలో రూ.1995, ముంబయిలో రూ.1844, చెన్నైలో రూ.2045 గా నిర్ణయించారు. ఇక19 కిలోల ఎల్పీజీ కమర్షియల్ సిలిండరు ధరపై 91.5 రూపాయలు తగ్గించడంతో రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాళ్లకు కొంత ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. కానీ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై ఎలాంటి తగ్గింపూ ప్రకటించకపోయేసరికి సామాన్య ప్రజలు అసంతృప్తికి గురవుతున్నారు.