ఘనంగా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్

ఘనంగా ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రైడ్​ఆఫ్​తెలంగాణ అవార్డ్స్–2025  సంబంధించి 6వ ఎడిషన్​ను రౌండ్​టేబుల్​ఇండియా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హైటెక్​సిటీలోని హైటెక్స్​లో ఉన్న నోవాటెల్​ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని గర్వపడేలా చేసిన అత్యుత్తమ వ్యక్తులను, ప్రతిభావంతులను సత్కరించి అవార్డులను అందజేశారు.

 ట్రిబ్యూట్, ఎచీవర్స్, స్పెషల్​ జ్యూరీ అవార్డీ, ఎమర్జింగ్​ టాలెంట్​ కేటరీల్లో అందజేశారు.  డార్విన్​బాక్స్​సంస్థ ఎచీవర్, వైడర్​ఎమెర్జింగ్​టాలెంట్​సంస్థలు స్టార్టప్​ కేటగిరీలో అవార్డులను అందుకున్నాయి. ఈ కార్యక్రమం టేబుల్​చైర్మన్​ సిద్ధార్ధ జి, కన్వీనర్​ నీషన్​ గుప్తా ఆధ్యర్యంలో నిర్వహించారు.

 శివాంశ్​స్కూల్​ఆఫ్​ఆర్ట్స్​ద్వారా క్లాసికల్​ప్యూజన్​ ప్రదర్శక అందరినీ ఆకట్టుకుంది. ఒగ్గు రాజశేఖర్​ బృందం ఒగ్గుడోలు ప్రదర్శనతో సందడి చేశారు. బాలీవుడ్ మేడ్లీ భూమిక తివారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాంత్​ రిసా సౌండ్​ ఆర్ట్​ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.