వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఆలోచించట్లే

వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఆలోచించట్లే

న్యూఢిల్లీ: భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి కుటుంబ పాలన ప్రమాదకరమని ప్రధాని మోడీ అన్నారు. పార్టీల్లో సంస్థాగతంగా ప్రజాస్వామ్య విలువలు, ఆదర్శాలను జోడించాలని రాజ్య సభలో మోడీ కోరారు.  దేశంలో అతి పురాతన పార్టీ అయినా కాంగ్రెస్ నుంచి ఇది మొదలవ్వాలన్నారు. కాంగ్రెస్ దీన్ని పాటించి.. అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ‘భారత్ 1947లో పుట్టిందనే తప్పుడు భావనలో కొందరు ఉన్నారు. దాని వల్లే చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 50 ఏళ్లు దేశాన్ని ఏలే అవకాశం వచ్చిన పార్టీ పాలన పైనా ఈ ఆలోచన ప్రభావం చూపింది. ఈ వికారాలన్నింటకీ ఆ భావనే కారణం. ఈ ప్రజాస్వామ్య దేశానికి మీ (కాంగ్రెస్) దయ అనవసరం. ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లు అని ప్రపంచం ముందు చెప్పడానికి వారు భయపడ్డారు. డెమొక్రసీ, డిబేట్ (ప్రజాస్వామ్యం, చర్చలు) భారత్ లో ఎన్నో శతాబ్దాలుగా ఉనికిలో, ఆచరణలో ఉన్నాయి. వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఏమీ ఆలోచించలేదు. వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలతో భారత్ కు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అందరూ ఒప్పుకోవాలి. ఏదైనా పార్టీలో ఓ కుటుంబమే కీలకంగా మారినప్పుడు.. ఆ ఫ్యామిలీ వ్యక్తుల్లో ఎవరిలో అత్యుత్తమ ప్రతిభ దాగుందనేది ముఖ్యంగా మారుతుంది’ అని మోడీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్

'మహాభారత్' భీముడు ఇకలేరు

టాలీవుడ్.. మోడీ పొగిడారని పొంగిపోవద్దు