దేశంలో పులుల సంఖ్యను వెల్లడించిన ప్రధాని మోడీ

దేశంలో పులుల సంఖ్యను వెల్లడించిన ప్రధాని మోడీ

దేశంలో ఎన్ని పులుల సంఖ్యను ప్రధాని మోడీ విడుదల చేశారు. ప్రాజెక్ట్‌ టైగర్‌ స్వర్ణోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ...దేశంలో పులుల గణన వివరాలను వెల్లడించారు. దేశంలో పులుల సంఖ్య గణనీయందా పెరిగిందని ప్రకటించారు. 2022 నాటికి దేశంలో 3,167 పులులు ఉన్నాయని వెల్లడించారు. 

మోడీ విడుదల చేసిన నివేదిక ప్రకారం..

2018తో పోలిస్తే దేశంలో  200 పులులు పెరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 2018లో దేశంలో 2,967 పులులు మాత్రమే ఉన్నాయని మోడీ చెప్పారు.   మోదీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016లో దేశంలో 1,411 పులులు,2 014లో 2,226 పులులు, 2010లో 1,706 పులులు, 2006 లో 1411 పులులు ఉన్నాయి. ప్రధాని విడుదల చేసిన డేటా ప్రకారం..భారత్ లో గత రెండు దశాబ్దాల్లో పులుల సంఖ్య దాదాపు రెట్టింపు అయింది. ప్రాజెక్ట్ టైగర్ 50 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ (IBCA )ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆ తర్వాత  స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ఇతర ప్రముఖులు టైగర్ కు స్టాండింగ్ ఓవివేషన్ ఇచ్చారు. 

75 శాతం భారత్ లోనే..

ప్రపంచంలోని పులుల జనాభాలో 75 శాతం భారతదేశంలోనే ఉన్నాయని ప్రధాని మోడీ అన్నారు. పులుల సంరక్షణలో ప్రాజెక్ట్ టైగర్ ముందంజలో ఉందని చెప్పారు. ప్రకృతిని పరిరక్షించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్ విజయం దేశానికే కాదు..యావత్ ప్రపంచానికి గర్వకారణమని మోడీ వెల్లడించారు.  భారత్ లో దశాబ్దాల క్రితమే చిరుతలు అంతరించిపోయాయన్నారు. కానీ... నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి పులిని తీసుకొచ్చామని చెప్పారు. దేశం దాదాపు 30 వేల ఏనుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆసియా ఏనుగుల శ్రేణిగా ఉందన్నారు.