సుందర్ పిచాయ్​తో.. మోదీ వర్చువల్​ మీట్​

సుందర్ పిచాయ్​తో.. మోదీ వర్చువల్​ మీట్​

గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగూల్ ప్రణాళికపై ఇద్దరూ చర్చించారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ -GIFTలో గూగుల్ తన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రధానమంత్రి మోదీ స్వాగతించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీలో భారత్ నిర్వహించనున్న AI సమ్మిట్‌లో.. గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్‌ను మోదీ ఆహ్వానించారు.

జీ-పే, UPI బలాన్ని, రీచ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌లో ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి గూగుల్ ప్రణాళికల గురించి మోదీకి పిచాయ్ వివరించారు. వర్చువల్ సమావేశం అనంతరం.. దేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో HPతో గూగుల్ భాగస్వామ్యాన్ని మోదీ అభినందించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

గూగుల్ 100 భాషల ట్రాన్స్ లేట్ ను గుర్తించిన ప్రధాని.. భారత భాషలలో AI సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించారని చెప్పింది. గూగుల్ సంస్థ భారత్​లో చేపట్టిన ప్రణాళికలపై ప్రధాని మోదీతో భేటీ అద్భుతమని మాతృసంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ చెప్పారు.