
ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలు రెండో రోజు ముంబైలో ఘనంగా జరిగాయి. మూడు రోజులు పెళ్లి వేడుకల్లో భాగంగా శనివారం (జూలై 13,2024) సాయంత్రం శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్ నిర్వహించారు. స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు కొత్త జంట అనం త్ అంబానీ, రాధికా మర్చంట్ ను ఆశీర్వదించారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. శుభ్ ఆశీర్వార్ సెర్మనీలో భాగంగా కొత్త జంటను ఆశీర్వ దించారు.
జూలై 12, 2024 రాత్రి 9.30 గంటలకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు అంబానీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, దేశ విదేశాలనుంచి ప్రముఖులు గెస్ట్ లుగా హాజరయ్యారు. పాశ్చత్య సాంప్రదాయంలో గుజరాతీ ఆచారాలతో అనంత్, రాధికల వివాహ వేడుకలు జరిగాయి.
పెళ్లి వేడుకల్లో భాగంగా జూలై13,2024 సాయంత్రం శుభ్ ఆశీర్వాద్ సెర్మనీ నిర్వహించారు. మూడు రోజుల పెళ్లి వేడుకల్లో భాగంగా వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్న కొత్త జంటను స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఆశీర్వదించేందుకు ఆశీర్వాద్ సెర్మనీ శనివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొని నూతన వధు వరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ను ఆశీర్వదించారు.
అంబానీ సంబరాల్లో ప్రధాని మోదీ
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకలు ముంబైలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లికి దేశ విదేశాలనుంచి ప్రముఖులు గెస్టులుగా హాజరయ్యారు. రెండో రోజు పెళ్లి వేడుకల్లో రాజకీ, క్రీడా, వినోదం , వ్యాపార వర్గాలనుంచి ప్రముఖులు పాల్గొన్నారు. కొత్త జంట శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్ లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు.
స్వయంగా ముఖేష్ అంబానీ ప్రధానిని మోదీని కలిసి శుభ్ ఆశీర్వాద్ వేడుకలకు తీసుకెళ్తున్న వీడియోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. మరోవీడియోలో శుభ్ ఆశీర్వాద్ ఫంక్షన్ స్టేజీపై ఇషా , ఆకాష్ అంబానీలతో కలిసి కూర్చున్నట్లు కనిపిస్తుంది.