
తిరువనంతపురం : కేరళ తీరంలో నవశకం ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమృతోత్సవ వేళ ఐఎన్‌ఎస్ నౌక ప్రవేశం శుభపరిణామం అని పేర్కొన్నారు. భారత్‌కు సాధ్యం కానిది ఏదీ ఉండదని, ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌకను చూసి ప్రతి భారతీయుడు గర్వించాలని అన్నారు. కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో తొలి బాహుబలి నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ఈ విమాన వహక నౌకను జాతికి అంకితం చేశారు. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. దాదాపు ఏడాదిగా సముద్రంలో ట్రయల్ రన్ పూర్తి చేసుకున్న INS విక్రాంత్ నౌకాదళంలో చేరింది.... బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన....ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతంలో మరింత బందోబస్తు పెరగనుంది. ఇప్పటిదాకా భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ బ్రిటన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకున్నవే. అలాంటిది అగ్రదేశాలకు దీటుగా అత్యాధునిక విమాన వాహక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది.
ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన భారత్ సగర్వంగా తలెత్తుకుని నిలిచింది. చైనాతో ఉద్రిక్తత నెలకొన్న వేళ ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతమిస్తూ నిర్మించిన ఈ బాహుబలి యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇది 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో పూర్తిస్థాయిలో చేరే అవకాశముంది. బాహుబలి యుద్ధనౌకగా పేరుగాంచిన.... ఐఎన్ఎస్-విక్రాంత్ రాకతో హిందూ మహాసముద్ర జలాల్లో భారత తీర ప్రాంతంలో మరింత బందోబస్తు పెరగనుంది.