దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ నెల 27న మరోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ అవుతున్నారు. రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు, ఆంక్షల సడలింపు, వాటి ఎఫెక్ట్ ఎలా ఉందన్న విషయాలపై ఆయన చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ తరహా సమావేశాలు రెండు సార్లు జరిగాయి. లాక్ డౌన్ ప్రకటన చేయకముందు.. మార్చి 20న కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో చర్చించారు. ఆ తర్వాత మార్చి 24న జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ ఏప్రిల్ 11న మరోసారి లాక్ డౌన్ పొడిగించే విషయంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14న మీడియా ముందుకొచ్చి లాక్ డౌన్ ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు మోడీ.
దీంతో ఇప్పుడు మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ జరగబోతుండడంతో ఏయే అంశాలపై చర్చిస్తారు? ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటార్న ఉత్కంఠ నెలకొంది. లాక్ డౌన్ అమలు, ఆంక్షల సడలింపు ప్రభావం, అనుమానితులకు టెస్టింగ్, వలస కార్మికుల సమస్యలు, కేంద్రం నుంచి ఆర్థిక సాయం వంటి అంశాలపై చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
More News:
పాకిస్థాన్ ‘కరోనా కుట్ర’: జమ్ము కశ్మీర్ డీజీపీ
ఫ్యాక్ట్ చెక్: మే 3 తర్వాత లాక్ డౌన్ పొడిగింపు.. మోడీకి టాస్క్ ఫోర్స్ సలహా?
Prime Minister Narendra Modi will interact with CMs of all States via video conference on 27th April pic.twitter.com/k57HGUtosA
— ANI (@ANI) April 22, 2020
