క్వీన్ ఎలిజ‌బెత్ కొడుకు ప్రిన్స్ చార్లెస్ కు క‌రోనా

క్వీన్ ఎలిజ‌బెత్ కొడుకు ప్రిన్స్ చార్లెస్ కు క‌రోనా

నిరు పేద‌.. మ‌హారాజులా అన్న తేడా లేకుండా వ్యాపిస్తోంది..క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి. మార్చి 13న కెనడా ప్ర‌ధాని జ‌స్టిన్ ట్రూడో భార్య సోఫీ ట్రూడోకు ఈ వైర‌స్ సోకింది. గ‌త‌వారంలో యునైటెడ్ కింగ్ డ‌మ్ (యూకే) రాణి క్వీన్ ఎలిజ‌బెత్-2, ఆమె భ‌ర్త ప్రిన్స్ ఫిలిప్స్ ఉండే అధికార నివాస‌మైన బ‌కింగ్ హామ్ ప్యాలెస్ లోని ఓ ఉద్యోగికి క‌రోనా వైర‌స్ సోకింది.
ఇప్పుడు బ్రిట‌న్ రాణి ఎలిజ‌బెత్ కొడుకు ప్రిన్స్ చార్లెస్ (71)కు సైతం క‌రోనా వైర‌స్ సోకింది. స్కాట్లాండ్ లో ఉన్న‌ ఆయ‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో నేష‌న‌ల్ హెల్త్ స‌ర్వీస్ అధికారులు టెస్టులు చేయ‌గా.. క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో ఆయ‌న భార్య కామిలా పార్క‌ర్ బౌల్స్ కి కూడా వైద్య ప‌రీక్ష‌లు చేశారు. అయితే ఆమెకు వైర‌స్ సోక‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ప్రిన్స్ చార్సెస్ ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, ఆయ‌న‌ను హోం ఐసోలేష‌న్ లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నామ‌ని, పార్క‌ర్ ను కూడా క్వారంటైన్ చేశామ‌ని చెప్పారు NHS అధికారులు. అయితే ప్రిన్స్ చార్లెస్ కు వైర‌స్ ఎవ‌రి నుంచి సోకిందో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని, ఆయ‌న ఇటీవ‌ల చాలా మందిని క‌లిశార‌ని, ప‌లు ప‌బ్లిక్ ఈవెంట్స్ లోనూ పాల్గొన్నార‌ని అన్నారు. కాగా, ఇటీవ‌ల జ‌రిగిన కామ‌న్ వెల్త్ ఈవెంట్ లో ప్రిన్స్ చార్లెస్ అతిథుల‌ను ప‌ల‌క‌రిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వ‌బోయి వెంట‌నే వెన‌క్కి తీసుకుని భార‌తీయ సంప్ర‌దాయంలో న‌మ‌స్కారం చేసిన వీడియో వైర‌ల్ అయింది.

చైనాలో పుట్టి ప్ర‌పంచ‌మంతా వ్యాప్తించిన ఈ వైర‌స్ ఇప్ప‌టికే 4 ల‌క్ష‌ల 28 వేల మందికి సోకింది. ఇందులో దాదాపు 19 వేల మంది మ‌ర‌ణించారు. భార‌త్ లోనూ 562 మంది ఈ వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇక యూకే 8 వేల మంది క‌రోనా సోకగా.. 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక భార‌త్ లో 584 మంది వైర‌స్ బారిన‌ప‌డ‌గా.. 11 మంది మ‌ర‌ణించారు.