
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కొత్త సినిమా ‘ది గోట్ లైఫ్’. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటించారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ఈ సినిమాను రూపొందించారు. విజువల్ రొమాన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
ఏప్రిల్ 10న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేయనున్నట్టు గురువారం అనౌన్స్ చేశారు. తెలుగులో ‘ఆడు జీవితం’ పేరుతో రిలీజ్ అవుతోంది. ఇదొక సర్వైవల్ స్టోరీ. 90 వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను ఇందులో చూపించబోతున్నారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.