
ఓ వైపు మలయాళంలో హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల్లో ఇంపార్టెంట్ రోల్స్‌తో మెప్పిస్తున్నాడు పృథ్విరాజ్ సుకుమారన్. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆయన విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పృథ్విరాజ్ హీరోగా నటిస్తున్న మలయాళ చిత్రం ‘ఖలీఫా’ ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. ప్రస్తుతం గ్లింప్స్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. 1 మిలియన్స్కి పైగా వ్యూస్తో దూసుకెళ్తోంది.
A MILLION AND HOW! 😎🧨
— Sony Music South India (@SonyMusicSouth) October 17, 2025
The trending #Khalifa #TheBloodline promo 💥
➡️ https://t.co/3FNKJr6xR0@PrithviOfficial @DirectorVysakh #JinuVAbhraham #JiinuInnovation #SurajKumar #JomonTJohn @jakes_bejoy #KhalifaOnSonyMusic pic.twitter.com/aTG3EjitbL
‘ది బ్లడ్ లైన్’ క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్‌లో అతను ‘ఆమిర్ ఆలీ’ అనే గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. గోల్డ్ మాఫియా నేపథ్యంలో సినిమా ఉండబోతోందని టీజర్ ప్రారంభంలోనే చూపించారు.
‘‘బంగారం ప్రతిచోటా ఉంది.. చాలా మందికి దానిని చూడటానికి సరైన శిక్షణ లేదు” అనే క్యాప్షన్ ఆకట్టుకుంది. కస్టమ్స్ ఆఫీసర్స్ గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించి ఓ ముసలి వ్యక్తిని ఇంటరాగేట్ చేస్తుంటారు. తన డైలాగ్ ఎలివేషన్స్‌తో పృథ్విరాజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంది.
జేక్స్ బెజాయ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. వైశాఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పదిహేనేళ్ల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. జిను వి. అబ్రహం, సూరజ్ కుమార్ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఓనం సందర్భంగా విడుదల చేయనున్నారు.