
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. MMTS రెండో దశ పనులకు 40 కోట్లు కేటాయించింది. అలాగే.. చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ కు 5 కోట్లు ఇచ్చారు. ఇక కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించారు. మనోహరాబాద్-కొత్తపల్లి కొత్త లైన్ ప్రాజెక్టు కోసం 235 కోట్లు మంజూరు చేశారు. మునీరాబాద్-మహబూబ్ నగర్ లైన్ కు 240 కోట్లు, భద్రాచలం-సత్తుపల్లి లైన్ కు 520 కోట్లు ఇచ్చారు. కాజీపేట-బల్లార్ష మూడో లైన్ కు 483 కోట్లు మంజూరు చేశారు. అటు.. విశాఖ రైల్వే జోన్ కు 170 కోట్లు, నడికుడి-శ్రీకాళహస్తి లైన్ కు 1198 కోట్లు మంజూరయ్యాయి. ..
అలాగే 11 రూట్లలో ప్రయివేటు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి-వారణాసి, లింగంపల్లి-తిరుపతి, చర్లపల్లి-పర్వేలి, విజయవాడ-విశాఖపట్టణం, చర్లపల్లి-శాలిమార్, ఔరంగబాద్-పన్వెలి, సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి-చెన్నై, గుంటూరు-లింగంపల్లి రూట్లలో ప్రయివేటు రైళ్లు తిరగనున్నాయి. గుంటూరు-లింగంపల్లి, ఔరంగబాద్-పన్వెలి, చర్లపల్లి-శ్రీకాకుళం రూట్లలో తేజస్ రైళ్లు వచ్చే ఛాన్సుంది.