Priyanka Chopra: చీర కట్టులో మెరిసిన ప్రియాంక చోప్రా..ఈవెంట్కే అందం తెచ్చేసింది

Priyanka Chopra: చీర కట్టులో మెరిసిన ప్రియాంక చోప్రా..ఈవెంట్కే అందం తెచ్చేసింది

అమెరికాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా Priyanka Chopra) అదరగొట్టింది. ఆమె అందానికి అక్కడి వారంతా అవాక్కయ్యారు. నల్ల చీరలో మత్తెక్కించే ఆమె ఫొజులకు చూపరులంతా మంత్రముగ్దులయ్యారు.  ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ కాలిఫోర్నియాలో ఓ ఈవెంట్‌ ను నిర్వహించాడు. దీనికి పలువురు ప్రముఖులతో పాటు ప్రియాంక చోప్రా కూడా హాజరైంది.

ఈ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా చీరకట్టులో మెరిసింది. ఆ ఈవెంట్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ప్రియాకం చోప్రా పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్ గా మారాయి.

ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో చీరకట్టులో ప్ర‌త్య‌క్ష‌మైన‌ ప్రియాంక ఫోటోలకు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రియాంక చోప్రా చీర కట్టులో చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ :- Shruti Hassan: మ్యాగజైన్ క‌వ‌ర్ పేజీపై..శ్రుతి అంద‌చందాలు

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ది బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది. ఫ్రాంక్ ఇ ఫ్లవర్స్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. 19వ శతాబ్దపు కరేబియన్ నేప‌థ్యంలో సాగే క‌థాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Patty C (@jerryxmimi)