
న్యూఢిల్లీ: ఇండియా రేస్ వాకర్ ప్రియాంక గోస్వామి.. ఆస్ట్రియన్ రేస్ వాకింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. సోమవారం రాత్రి ఇన్స్‌బ్రక్‌లో జరిగిన విమెన్స్ 10 కిలోమీటర్ల వాక్‌ను 47ని, 54 సెకన్లలో ముగించి టాప్ ప్లేస్‌లో నిలిచింది. అయితే 2022లో ఆమె నెలకొల్పిన పర్సనల్ బెస్ట్ (45ని, 47 సెకన్లు)ను అధిగమించలేకపోయింది. ఇక 20 కిలో మీటర్ల వాక్‌లో ప్రియాంక (1:28.45 సెకన్లు) పేరిట నేషనల్ రికార్డు ఉంది.
‘నిమిషం పెనాల్టీ తర్వాత కూడా నేను రేసు పూర్తి చేశాను. పెనాల్టీ, జ్వరం తర్వాత స్వర్ణం సాధించడం అంత సులువు కాదు’ అని ప్రియాంక వ్యాఖ్యానించింది. మెన్స్ 35 కిలో మీటర్ల రేస్ వాక్‌లో సందీప్ కుమార్ 2 గం, 38.45 సెకన్లతో రెండో ప్లేస్‌ను సాధించాడు. రామ్‌బాబూ (2:41.47 సెకన్లు) మూడో ప్లేస్‌తో సరిపెట్టుకున్నాడు.