
విశాఖపట్నం: ప్రొ కబడ్డీ లీగ్12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ హ్యాట్రిక్ విజయం సాధించింది. సొంతగడ్డపై తమ చివరి మ్యాచ్‌లో చెలరేగింది. బుధవారం రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టీమ్ 45–-37తో యుముంబాను ఓడించింది. టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్ (13 పాయింట్లు) సూపర్ టెన్‌తో మెరువగా.. రైడర్లు విజయ్ మాలిక్ (5), చేతన్ సాహు (6) కూడా సత్తా చాటారు. యు ముంబా జట్టులో సతీశ్ (6 ), సునీల్ కుమార్ (6) పోరాడారు.
ఈ విజయంతో తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో మూడో ప్లేస్‌కు దూసుకొచ్చింది. మరో మ్యాచ్‌లో పుణెరి పల్టాన్ 43–32తో యూపీ యోధాస్‌ను చిత్తుగా ఓడించింది. వైజాగ్ దశలో ఆఖరి రోజైన గురువారం జరిగే మ్యాచ్‌ల్లో యు ముంబాతో పట్నా పైరేట్స్, దబాంగ్ ఢిల్లీ కేసీతో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి.