నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నా : సి.కళ్యాణ్

నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నా :  సి.కళ్యాణ్

‘బాలకృష్ణ గారితో  సినిమా చేయాలనేది నా కోరిక.  నిర్మాతని నిర్మాతగా గౌరవించే కథానాయకుడు ఆయన. అందుకే ఆయనంటే నాకు చాలా అభిమానం’ అన్నారు నిర్మాత సి.కళ్యాణ్. శనివారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా శుక్రవారం సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ‘అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌‌‌గా కెరీర్ స్టార్ట్‌‌ చేసి నిర్మాతగా 83 చిత్రాలను నిర్మించా.  

నెక్స్ట్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నా. అలాగే మరో రెండు చిన్న సినిమాలకు ప్లాన్ చేస్తున్నా.  గత రెండేళ్ళుగా చెన్నైలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కళ్యాణ్‌‌ అమ్యూజ్మెంట్‌‌ పార్క్‌‌’పై ఫోకస్‌‌ పెట్టాను. వచ్చే ఏడాది తమిళ నూతన సంవత్సరానికి లాంచ్ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే ప్రాజెక్ట్‌‌ కనుక..

సీఎం స్టాలిన్ గారికి కూడా దీన్ని త్వరగా ప్రారంభించాలనే ఉత్సాహం ఉంది. ఇండియాలో తొలిసారి అందులో స్కై థియేటర్ ఏర్పాటు చేస్తున్నాం.  పార్క్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సినిమాల నిర్మాణం కోసం ఖర్చు చేస్తాం. కడదాక సినిమాలు తీస్తూనే ఉంటా. ఇండస్ట్రీ తరపున త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం.  హైదరాబాద్‌‌లో  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌తో పాటు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌ని నిర్వహించాలని కోరుతాం’ అని చెప్పారు.