Game Changer: గేమ్ చెంజర్ వచ్చేది అప్పుడే.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన దిల్ మావ

Game Changer: గేమ్ చెంజర్ వచ్చేది అప్పుడే.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన దిల్ మావ

మెగా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ పై క్లారిటీ వచ్చేసింది. తాజాగా రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer) రిలీజ్ పై క్లారిటీ ఇచ్చాడు చిత్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju). రీసెంట్ గా ఆయన రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మార్చ్ 27 రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మెగా అభిమానులు మెగా సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతున్న సమయంలో గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ అడిగారు ఫ్యాన్స్. దానికి సమాధానంగా దిల్ రాజు మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కావాలా. మీ ఓపికలకు చాలా పరీక్ష పెడుతున్నాం. కానీ, తుఫాన్ వచ్చే ముందు ఓపిక పట్టక తప్పదు. ఆర్ఆర్ఆర్ తరువాత వస్తున్న సినిమా కాబట్టి, రామ్ చరణ్ కూడా ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. కాబట్టి ఆ రేంజ్ కి తీసుకెళ్లడానికి శంకర్ గారు కష్టపడుతున్నారు. మారో నాలుగు నెలలు ఓపిక పట్టండి. చాలా గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ సినిమా మీ ముందుకు వస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇక గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తున్నారు. తమిళ స్టార్ ఎస్ జె సూర్య విలన్ గా చేస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, ప్రియదర్శి తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.