
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. దర్శకుడు నెల్సన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కళానిధి మారన్ చెన్నైలో సక్సెస్ మీట్ (Jailer success celebrations) ఏర్పాటుచేశారు.
ఇందులో భాగంగా జైలర్ సినిమాలో నటించిన వారికి, ఆ సినిమాకు పనిచేసిన సాంకేతిక బృందానికి గోల్డ్ కాయిన్స్ కానుకగా అందించారు నిర్మాత కళానిధి మారన్. 300 మందికిపైగా ఈ గోల్డ్ కాయిన్స్ ను అందుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇప్పటిమే జైలర్ హీరో రజనీకాంత్ కు బీఎండబ్ల్యూ ఎక్స్7, దర్శకుడు నెల్సన్ కుమార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh Ravichander)కు ఖరీదైన పోర్ష్ కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు నిర్మాత.
BREAKING: Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today.
— Manobala Vijayabalan (@ManobalaV) September 10, 2023
????????? ???????? ??????pic.twitter.com/6efmA5tkTo
Also Read : సారీ.. ఆ బోల్డ్ సిరీస్ నేను చేయలేనంటున్న లావణ్య త్రిపాఠి
ఇక జైలర్ సినిమా విషయానికి వస్తే.. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా.. రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ(Amazon Prime OTT)లో స్ట్రీమింగ్ అవుతోంది.