పవన్ కటౌటే పెద్ద పబ్లిసిటీ.. బ్రో నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవన్ కటౌటే పెద్ద పబ్లిసిటీ.. బ్రో నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) స్పెషల్ రోల్ లో కనిపిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో(Bro). తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samutirakhani) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) హీరోగా చేస్తున్నాడు. ఇద్దరు మెగా హీరోలు కలిసి చేస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా రిలీజైన బ్రో ట్రైలర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది బ్రో ట్రైలర్. 

ఇక తాజాగా బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బ్రో చిత్ర నిర్మాత విశ్వప్రసాద్(Vishwaprasad). ఈమేరకు బ్రో సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో యాంకర్.. బ్రో సినిమా రిలీజ్ కు ఒక వారం కూడా సమయంలేదు ప్రమోషన్స్ పెద్దగా కనిపించడం లేదు ఎందుకు అని అడిగారు. దానికి సమాధానంగా నిర్మాత విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో. ఆయన సినిమాలో ఉన్నాక ఇంకా ప్రమోషన్స్ ఎందుకు. ఆయన కటౌటే మాకు పెద్ద పబ్లిసిటీ. అంటూ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

ALSO READ:తమన్నా చేతికి ఖరీదైన డైమండ్ రింగ్.. ఎవరు గిఫ్ట్ ఇచ్చారో తెలుసా? 

ప్రస్తుతం విశ్వప్రసాద్ పవన్ పై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. విశ్వప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ కు పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అద్ది మా పవనన్న రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ(Kethika sharma), ప్రియప్రకాశ్(Priya prakash) లు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు