కరెంటు లేకపోయినా బతుకుతున్న..ఇదే నా లైఫ్ స్టైల్

కరెంటు లేకపోయినా బతుకుతున్న..ఇదే నా లైఫ్ స్టైల్

పది నిమిషాలు కరెంట్‌ పోతే కిందా మీదా అయిపోతాం. అట్లాంటిది కొన్నేళ్లుగా ఓ మాజీ ప్రొఫెసరమ్మ కరెంట్‌ జోలికే పోకుండా బతికేస్తోంది. పూణె బుద్వార్‌పేటలో ఉండే మాజీ ప్రొఫెసర్ డా.హేమ సానే (79) ఇంటికి కరెంటు కనెక్షన్ ఉండదు. దీంతో మీడియా ఆమెపై ఫోకస్‌ చేసింది. ‘అందరికీ తిండి, దుస్తులు, ఇల్లు కనీస అవసరాలు. కరెంటెందుకు? మనిషి చాలా ఏళ్లు బతికిన తర్వాత కరెంట్‌ వచ్చింది. నాకైతే కరెంట్‌ అవసరమే లేదు. ఒక కుక్క, రెండు పిల్లలు, ఇతర జంతువులతోపాటే నేనూ ఇంట్లో ఉంటున్నా. నిజానికి వాటిదే ఇల్లు. చాలా మంది నన్ను పిచ్చిది అనుకుంటుంటారు. నాకిష్టమొచ్చినట్టు నేను బతుకున్నా. ఇదే నా లైఫ్‌ స్టైల్‌’ అన్నారు హేమ. ఆమె కొన్ని పుస్తకాలు కూడా రాశారు. మనకు నచ్చినట్టు బతకితే ఉండే తృప్తే వేరని ఆవిడ అంటుంటారు.