వరి పంటను పరిశీలించిన సైంటిస్ట్​ : రేవంత్ ​నాథన్

వరి పంటను పరిశీలించిన సైంటిస్ట్​ : రేవంత్ ​నాథన్

లింగంపేట,వెలుగు: మాల్తుమ్మెద ఏరువాక కేంద్రం సైంటిస్ట్​ రేవంత్ ​నాథన్​ శనివారం మండలంలోని మెంగారంలో రైతు గొల్ల బాలయ్య యాదవ్ ​సాగుచేస్తున్న వరి పంటను పరిశీలించారు. ప్రొఫెసర్ ​జయశంకర్​ అగ్రికల్చర్​ యూనివర్సిటీ సైంటిస్టులు కొత్తగా రూపొందించిన డబ్ల్యూజీఎల్​1537, ఆర్డీఆర్​1162, కేపీఎస్​6251 రకాల వరి సాగు గురించి రైతును అడిగి తెలుసుకున్నారు.  కొత్త రకం విత్తనాలతో సాగుచేసిన వరి పైర్లు ఏపుగా పెరిగి ఆశాజనకంగా ఉండడం పట్ల సైంటిస్ట్​ సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నాగరాజు, లక్ష్మీనారాయణ, సత్యాగౌడ్, బాలసాయిలు, ప్రమీల, తోట సత్యవ్వ, కుమ్మరి సాయిలు ఉన్నారు.