తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు: మొత్తం 8 పోస్టులు.. మే 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు..

తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాలు: మొత్తం 8 పోస్టులు.. మే 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూలు..

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) టీచింగ్ అసోసియేట్స్ / పార్ట్ టైమ్ టీచర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 8.

విభాగాల వారీగా ఖాళీలు: అగ్రోనామి 2, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ 1, అగ్రిల్చరల్ ఎకానమీ 1, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ 1, అగ్రికల్చరల్ ఎక్స్​టెన్షన్ 1, హార్టికల్చర్ 1, యానిమల్ ప్రొడక్షన్ 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ (అగ్రికల్చరల్), ఎంఎస్సీ (హార్టికల్చర్), ఎంవీఎస్​సీ, పీహెచ్​డీ/ నెట్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. కనీసం రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ (అగ్రోనామి, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, అగ్రికల్చరల్ ఎకానమీ): మే 11. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, అగ్రికల్చరల్ ఎక్స్​టెన్షన్, హార్టికల్చర్, అనిమల్ ప్రొడక్షన్: మే 12. 

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ pjtau.edu.in ను సందర్శించండి.