పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటం : మంత్రి కొండా సురేఖ

పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటం :  మంత్రి కొండా సురేఖ
  •  కాంగ్రెస్​లో చేరిన వరంగల్​తూర్పు బీఆర్​ఎస్ ​కార్పొరేటర్లు 

కాశీబుగ్గ, వెలుగు: గ్రేటర్​వరంగల్​పై కాంగ్రెస్​ పూర్థి స్థాయిలో పట్టు సాధించిందని ఆటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిండెంట్​బొమ్మ మహేశ్​కుమార్ ​గౌడ్​, కాంగ్రెస్​ పార్టీ (తూర్పు) మైనార్టీ సీనియర్​ నాయకుడు మహ్మద్ ఆయూబ్​ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 11మంది బీఆర్ఎస్​ కార్పొరేటర్లతో పాటు12 డివిజన్ల అధ్యక్షులు చేరారు. 

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ గ్రేటర్​వరంగల్​ అంతా కాంగ్రెస్​మయమైందని, చేరిన వారందరినీ పార్టీ కంటికి రెప్పలా పాడుకుంటుందన్నారు. కాంగ్రెస్ ​పార్టీతోనే వరంగల్​తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కార్పొరేటర్లు బోరబోయిన ఉమా, కావటి కవిత, వస్కుల బాబు, ఓని స్వర్ణలత, భాస్కర్, బస్వరాజు కుమార్​, ఆకుతోట తేజస్విని శిరీష, చింతాకుల అనిల్, ముష్కమల్ల అరుణ, పోశాల పద్మ, సురేశ్ జోషి, మాజీ కార్పొరేటర్లు దామోదర్​ యాదవ్, జారతి రమేశ్, కల్పన, రజిత, గౌడ్​ సొసైటీ చైర్మన్​ శ్యామ్​, తోట హరీశ్ చేరారు. తర్వాత క్యాంప్​ఆఫీసుకు వెళ్లి  సీఎం రేవంత్​రెడ్డిని కలిశారు. కార్పొరేటర్ ​గుండేటి నరేందర్, డివిజన్ల అధ్యక్షులు పాల్గొన్నారు.