బతుకుమ్మ చీరల పంపిణీకి కార్యకర్తలు దూరం

బతుకుమ్మ చీరల పంపిణీకి కార్యకర్తలు దూరం

మంత్రి సత్యవతి రాథోడ్ కు ములుగు జిల్లా నిరసన సెగ తగిలింది. ములుగు గట్టమ్మ దేవాలయం, మేడారం సమ్మక్క-సారలమ్మలకు బతుకుమ్మ చీరలు సమర్పించే కార్యక్రమానికి టీఆర్ఎస్  ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. దళిత బంధు స్కీంలో లబ్దిదారుల ఎంపికలో పార్టీ కార్యకర్తలు, పేదలు అన్యాయం జరుగుతున్నా మంత్రి పట్టించుకోవడం లేదంటూ మంత్రి ప్రొగ్రాంని బహిష్కరించారు. కార్యక్రమానికి సత్యవతి రాథోడ్, జిల్లా ZP చైర్మన్ కుసుమ జగదీశ్ తప్ప ఎవరూ హాజరుకాలేదు. 

గత రెండ్రోజల క్రితం కూడా ములుగు జిల్లాలో మంత్రి సత్యవతి రాథోడ్ కు  నిరసన సెగ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితులు ఆమెను  అడ్డుకున్నారు. దళితబంధు స్కీంలో తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మంత్రి కారు ముందు నిరసన చేపట్టారు. మంత్రి  కాళ్లు పట్టుకొని దళితులకు న్యాయం చేయాలని వేడుకున్నారు.