ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీజేఐపై దాడికి నిరసనగా ఆందోళనలు

 ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీజేఐపై దాడికి నిరసనగా ఆందోళనలు

వెలుగు, నెట్​వర్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళనలు చేపట్టారు.  కోడేరులో అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. దళితుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావడం జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఆది సోమనాథ్, ఆదిరాజు, చామంతి రాజు, దర్గా స్వామి, శంకర్, రాములు, కాకం లక్ష్మయ్య పాల్గొన్నారు.

కొల్లాపూర్ లో బార్  అసోసియేషన్  ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. బార్  అసోసియేషన్  అధ్యక్షుడు నాగరాజు, ఉపాధ్యక్షుడు నిరంజన్  మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. భాస్కర్ రెడ్డి, వసంత రెడ్డి, శ్రీహరి, బాలస్వామి, మనోహర్, నిరంజన్, కురుమూర్తి, రాఘవేంద్ర, మధుసూదన్ రావు, మనోహర్  పాల్గొన్నారు.

 పెంట్లవెల్లిలో సామాజిక కార్యకర్త మూల మేఘరాజు ఆధ్వర్యంలో అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కోట్ల సురేందర్, గోవు కుర్మయ్య, మూలే లాలు, ఎండీ షేక్​షావలి, ఎం తిమ్మస్వామి, బి బాలరాజు, ఎం రాజు, మూలే కృష్ణయ్య, కోట్ల వెంకటస్వామి,ఆర్  నారాయణ, బత్తిని కృష్ణ, అవుట రమేశ్​ పాల్గొన్నారు.

 ఆమనగల్లు జూనియర్  సివిల్  జడ్జి కోర్టులో న్యాయవాదులు విధులను బహిష్కరించి కోర్టు ఆవరణలో నిరసన తెలిపారు. బార్  అసోసియేషన్  అధ్యక్షుడు యాదిలాల్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, రామకృష్ణ, విజయ్ కుమార్  గౌడ్, కృష్ణ, గణేశ్, శేఖర్, మల్లేశ్, జానకిరాములు పాల్గొన్నారు.

మహబూబ్​నగర్​లో ప్రజా, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. సనాతన ధర్మం పేరుతో సీజేఐపై దాడి చేసిన లాయర్​ను కఠినంగా శిక్షించాలని డిమాండ్  చేశారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ, దళితుడిపై చేసిన దాడిగా వారు పేర్కొన్నారు. ఎం.రాఘవాచారి, ఫారూఖ్​హుసేన్, హనీఫ్, లక్ష్మీకాంత్, తిప్పమ్మ, శ్రీశైలం, వామన్ కుమార్, చెన్నయ్య, సుదర్శన్, అజయ్, రవిబాబు,వెంకటేశ్వర్లు, ప్రభాకర్  పాల్గొన్నారు.