
గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచన
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని రాష్ట్రాలు గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో నగరాల మధ్య లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్స్ అందుబాటులో ఉంచడానికి గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. అంతర్ జిల్లా, అంతర్ రాష్ట్ర నిబంధనల పేరుతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడుతున్నందున ఆస్పత్రుల వారీగా ఇన్వెంటరీ మేనేజ్‌మెంజ్‌ను సృష్టించాలని పేర్కొంది. అలాగే స్టాక్ అయిపోకుండా ఉండేందుకు సమయానుకూలంగా సిలిండర్లను నింపే విధానాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఆక్సిజన్ సిలిండర్స్ మ్యానుఫ్యార్చర్స్‌కు సకాలంలో బకాయిలు చెల్లించాలని పేర్కొంది. పవర్ సప్లయి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూనిట్స్‌ను పెంచుకోవాలని తెలిపింది. రోజుకు 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నందున స్టీల్ ప్లాంట్లతో మంచి సమన్వయంతో ఉండాలని వివరించింది.