ట్రాఫిక్ ఫైన్లు తప్పించుకునేందుకు జిమ్మిక్కులు

ట్రాఫిక్ ఫైన్లు తప్పించుకునేందుకు జిమ్మిక్కులు

హైదరాబాద్: నగరంలో అనేక వాహనాలు రూల్స్ కు విరుద్ధంగా తిరుగుతున్నాయి. కట్టడి లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. వీటికి తోడు శాంతిభద్రతల సమస్యలు వస్తున్నాయి. ప్రధానంగా నంబర్ ప్లేట్స్ సరిగ్గా లేకపోవడం...ఎక్కువ మంది హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ ఫిట్ చేసుకోకపోవడం కూడా కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్టీఏ ఆఫీసుల్లో ఏళ్లకేళ్లుగా వేలాది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ మూలకు పడేసి ఉండటం చర్చనీయాంశమైంది.

వాహనాలకు కనిపించని నంబర్ ప్లేట్స్

రాష్ట్రంలో ఆర్టీయే రూల్స్ కు విరుద్దంగా ట్రాన్స్ పోర్ట్, నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాయి.  చాలా వాహనాలకు నంబర్ ప్లేట్స్  కనిపించడం లేదు. మరికొన్నింటికి వాళ్లకిష్టమైన పద్దతిలో రాసుకుంటున్నారు. కొన్ని టూవీలర్ల నంబర్ ప్లేట్స్ కనిపించకుండా చేస్తున్నారు. హెల్మెట్ లేకున్నా... ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి చలాన్ల నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారు.

వాహనాలు ప్రమాదాలకు గురైనా.... వేరు వాహనాలను ఢీకొట్టి వెళ్లిపోయినా... నంబర్ ప్లేట్స్ ఐడెంటీఫై చేయడం పోలీసులకు కష్టం అవుతోంది. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు 2013 లో రవాణాశాఖ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఐతే వీటి జారీలో స్పీడప్ లేకపోవడంతో వాహనదారులకు ఇబ్బందిగా మారింది. హై సెక్యూరిటీ నెంబర్ల పై అవగాహన లేకపోవడం.. ప్లేట్ల నాణ్యత లోపం, బాగా ఆలస్యంగా నంబర్ ప్లేట్స్ రావడం, ఫిటింగ్ చార్జీలు అదనంగా తీసుకోవడంతో వాహనదారులకు వీటిపై ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో... ఇన్నేళ్లైనా సగం వెహికిల్స్ కి కూడా హై సెక్యూరిటీ ప్లేట్స్ కనిపించడం లేదు.

వాహనం  కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. చాలామంది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ తీసుకెళ్లడం లేదు. ఆర్టీఏ ఆఫీసుల్లోనే వేల సంఖ్యలో నెంబర్ ప్లేట్లు పడి ఉన్నాయి. వీటిల్లో చాలా వరకు క్వాలిటీగా లేవని... గట్టిగా లేకపోవడంతో కొద్ది నెలల్లోనే విరిగి పోతున్నాయని చెబుతున్నారు. అందుకే వీటిని తీసుకెళ్లడం లేదని తెలుస్తోంది.
టూవీలర్లకు, కార్లకు, ఆటోలకు వాడే ఎల్లో, వైట్ ప్లేట్స్ పెద్ద ఎత్తున పక్కన పెట్టేస్తున్నారు. ఫిటింగ్ చార్జీతో పాటు 250 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. అంతేగాక  ఆర్సీ తరహాలోనే నంబర్ ప్లేట్ ఇంటికే పంపడం సరైందని, నాణ్యతను కూడా పెంచాలని ప్రజలు సూచిస్తున్నారు. 

ప్రతి ఆర్టీయే ఆఫీసుల్లో ఏళ్ల నుంచి హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ ను తీసుకెళ్లకపోవడం..  బయటే సొంతంగా చేసుకుంటుండడంతో ఇబ్బందులొస్తున్నాయి. గతంలో కొన్ని పొరపాట్లతో ఆలస్యమైనా... ఇప్పుడు అవన్నీ పరిశీలించి నేరుగా వెహికిల్ డీలర్లకే ఇస్తున్నారు. కానీ కొంతమంది సెక్యూరిటీ ప్లేట్స్ నచ్చని వారు, రూల్ బ్రేక్ చేసేవారు అడ్డ దారిలో సొంతంగా నెంబర్ ప్లేట్స్ తయారు చేయించుకుంటున్నారు.

హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ స్కాన్ చేస్తే.. వెహికిల్ వివరాలతో పాటు, ఓనర్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు. వాహనాల దొంగతనం జరిగినా..  ప్రమాదానికి గురైనా.. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్స్ తో ఎంతో ఉపయోగపడతాయని ఆర్టీఏ జాయింట్ కమీషనర్  పాండురంగ నాయక్ చెప్పారు.  హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లపై పబ్లిక్ కు మరింత అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతుంటే.. ఈ నెంబర్ ప్లేట్లను తప్పనిసరిగా పెట్టాలనే రూల్ ను తీసుకొస్తే... ఉపయోగం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.