రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి

రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి

తెలంగాణలో పశ్చిమ బెంగాల్ వాతావరణం సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ తన వాహనంలో కర్రలు పెట్టుకోని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు.

‘బీజేపీ వాళ్లే టీఆర్ఎస్ కార్యకర్తల‎పై దాడి చేసి దొంగే దొంగ అన్నట్లు.. టీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. యాసంగి ధాన్యం కొనకపోతే బట్టలు విప్పి ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు. దేశంలో 36 పార్టీల మెడలు వంచి.. ఒప్పించి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. విద్వేషాలు రెచ్చకొడుతాం అంటే చూస్తూ ఉరుకోం. రైతులతో పెట్టుకున్న కాంగ్రేస్, టీడీపీ చరిత్ర బీజేపీ తెలుసుకోవాలి. పశ్చిమబెంగాల్లో చేసినట్లు గుండాయిజం చేస్తాం అంటే కుదరదు. ఇది తెలంగాణ అనే విషయం మరచిపోవద్దు. గుండా రాజకీయం చేస్తే రైతులు ఉరికిచ్చి కొడతారు. దిమాక్ లేని ఎంపీ బండి సంజయ్. సంజయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు? మోడీ ముందు, కేంద్ర వ్యవసాయ మంత్రి ముందు ధర్నాలు చేస్తే బాగుంటుంది. బందిపోటు దొంగల్లాగా వ్యవహరిస్తే చూస్తూ ఉరుకోం. బీజేపీ బురదజల్లే పార్టీగా మారింది. బిచ్చగాళ్లు, లుచ్చాగాళ్ల మాటలు బంద్ చేయాలి. రైతులతో రాళ్ల వర్షం కురిపించుకుంటారో.. పూల వర్షం కురిపించుకుంటారో బీజేపీ తేల్చుకోవాలి’ అని జీవన్ రెడ్డి అన్నారు.