
పెనుబల్లి, వెలుగు : పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద పర్యాటకులు స్టే చేసేందుకు నిర్మించాల్సిన బిల్డింగ్ పై అభివృద్ధి కమిటీ గురువారం చర్చలు జరిపింది. పెనుబల్లి మండలం కనకగిరి కొండలలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్ ఎకో టూరిజం గా అభివృద్ధి చేసేందుకు అధికారులు మరో అడుగు ముందుకు వేశారు. పర్యాటకులు రాత్రి స్టే చేసి ఉదయం ట్రెక్కింగ్ కు వెళ్లేలా హోమ్ స్టే బిల్డింగ్ నిర్మించాలని దానికి కావాల్సిన స్థలం, బడ్జెట్ పై చర్చించాలని జిల్లా అధికారుల ఆదేశాలతో పెనుబల్లి మండల కన్స్టిట్యూషన్ కమిటీ పులిగుండాల ప్రాజెక్ట్ వద్ద పర్యటించి స్థలాన్ని పరిశీలించింది.
అనంతరం టూరిజం డెవలప్మెంట్ కు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కమిటీలో ఎంపీడీవో అన్నపూర్ణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రాములు, ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ యశ్వంత్ కుమార్, బీట్ ఆఫీసర్ భరత్ కుమార్, ఆర్ఐ సక్రు తదితరులు పాల్గొన్నారు.