పుల్వామా తరహా ఎటాక్ కుట్ర భగ్నం

పుల్వామా తరహా ఎటాక్ కుట్ర భగ్నం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో పుల్వామా తరహా ఎటాక్ జరిపేందుకు టెర్రరిస్టులు చేసిన ప్లాన్ను మన ఆర్మీ వమ్ము చేసింది. 52 కిలోల ఎక్స్ ప్లోజివ్స్​ను సీజ్ చేసింది. గడికల్ లోని కరెవాఏరియాలో 42 రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు గురువారం జాయిం ట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు .సింటాక్స్ ట్యాంక్ లో దాచి ఉంచి న 416 ప్యాకెట్ల 52 కిలోల బరువైన ఎక్స్ ప్లోజివ్స్ ను సీజ్ చేశారు. ఒక్కో ప్యాకెట్ లో 125 గ్రాముల ఎక్స్ ప్లోజివ్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో సింటాక్స్ ట్యాంక్ లో 50 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు దొరికిన ప్రాంతం నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. పుల్వామా తరహా ఎటాక్ కు టెర్రరిస్టులు కుట్ర చేసినట్లు ఆర్మీ వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ ప్రకటించింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ తోపాటు ఇతరులపై 5 వేల పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.