చైన్ స్నాచర్‌తో పోరాడిన పదేళ్ల చిన్నారి

చైన్ స్నాచర్‌తో పోరాడిన పదేళ్ల చిన్నారి

ఇటీవలి కాలంలో దొంగతనాలు, మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని వెళ్లడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. మామూలు సందర్భాల్లో ఎన్నో చెప్తూ ఉంటాం.. దొంగలు వచ్చినపుడు ఇలా చేయాలి.. అలా ఎదుర్కోవాలి అని. కానీ ఆ సందర్భం వచ్చేసరికి అసలు ఏం చేయాలో కూడా తట్టదు. కానీ ఓ పదేళ్ల చిన్నారి మాత్రం తన ధైర్య సాహసాలతో దొంగలతో పోరాడి, వారిని పారిపోయేట్టు చేసింది. పూణెలోని మోడల్ కాలనీ ప్రాంతంలో ఓ వృద్ధురాలి గొలుసును లాక్కునేందుకు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ప్రయత్నించాడు.

అక్కడే ఉండి ఇదంతా గమనిస్తోన్న  ఆమె మనవరాలు,10 ఏళ్ల బాలిక ఆ దొంగలతో పోరాడింది. తన చేతిలో ఉన్న బ్యాగుతో వాళ్లను కొట్టి, తరిమేసింది. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వాళ్లు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 393 కింద పూణె పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.