సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత పంజాబ్.. సన్ రైజర్స్ ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ విజేత పంజాబ్.. సన్ రైజర్స్ ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్

2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని పంజాబ్ గెలుచుకుంది. సోమవారం(నవంబర్ 6) బరోడాతో జరిగిన హోరాహోరీ ఫైనల్స్​లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న జట్టుగా అవతరించింది. 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో 203 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అభిమన్యు సింగ్ 42 బంతుల్లో 61,రత్వా 22 బంతుల్లో 47, కృనాల్ పాండ్య 32 బంతుల్లో 45 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివర్లో విష్ణు సోలంకి 11 బంతుల్లో 28 పరుగులు చేసి బయపెట్టినా  టార్గెట్ మరీ పెద్దది కావడంతో బరోడాకు పరాజయం తప్పలేదు. ఆర్షదీప్ సింగ్ 4 వికెట్లతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీ అంతా నిలకడగా రాణించి టాప్ స్కోరర్ గా నిలిచిన పంజాబ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే.    

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. 18 పరుగులకే ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ, సిమ్రాన్ సింగ్ వికెట్లు కోల్పోయినా అల్మొప్రీత్ సింగ్ వీరోచిత శతకంతో చెలరేగాడు. 61 బంతుల్లో 113 పరుగులు చేసిన అల్మొప్రీత్.. ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 6 సిక్సులు ఉన్నాయి. చివర్లో నేహాల్ వధేరా 27 బంతుల్లోనే 61 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.