పంజాబ్లో టీకా తీసుకున్న ఉద్యోగులకే జీతం

పంజాబ్లో టీకా తీసుకున్న ఉద్యోగులకే జీతం

చండీగఢ్ : కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేసింది. టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం చెల్లించమని తేల్చి చెప్పింది. సింగిల్ లేదా డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే శాలరీ క్రెడిట్ అవుతుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను పంజాబ్ గవర్నమెంట్ జాబ్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశించింది. ఒమిక్రాన్ భయాలు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు కఠినం చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

For more news

గుంపులుగా సెలబ్రేషన్స్ చేసుకోవద్దని డీడీఎంఏ ఉత్తర్వులు

కరోనాపై రేపు ప్రధాని మోడీ సమీక్ష

అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్కు కరోనా