పెళ్లి పీటలెక్కనున్న మంత్రి, ఐపీఎస్ అధికారిణి

పెళ్లి పీటలెక్కనున్న మంత్రి, ఐపీఎస్ అధికారిణి

పంజాబ్  ఎడ్యుకేషన్ మినిస్టర్ హర్జోత్ బెయిన్స్,  ఐపీఎస్ ఆఫీసర్  డాక్టర్ జ్యోతి యాదవ్ పెళ్లిపీఠలు ఎక్కబోతున్నారు.   మార్చి 12న   వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ అయ్యింది.  హర్జోత్ బెయిన్స్, జ్యోతి యాదవ్  త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు   ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.  పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాన్ ద్వాన్ ఈ జంటకు విషెస్ చెప్పారు.

గతేడాడి  పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆనంద్ పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి  మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన హర్జోత్ బెయిన్స్ ప్రస్తుతం ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు.  హర్జోత్ బెయిన్స్  ది ఆనంద్ పూర్ సాహిబ్ లోని గంభీపూర్.  2017  ఎన్నికల్లో సహ్నేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆప్ యువజన విభాగం అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

పంజాబ్ క్యాడర్ కు  చెందిన ఐపీఎస్ అధికారి జ్యోతియాదవ్  ప్రస్తుతం మన్నా ఎస్పీగా ఉన్నారు.  హరియాణాలోని గురుగ్రామ్ కు చెందిన జ్యోతి యాదవ్ గతేడాది ఆప్ ఎమ్మెల్యే రాజీందర్ పాల్ కౌర్ చిన్నా ఇంట్లో సోదాలు చేసి వార్తల్లో నిలిచారు.