కూరగాయల్లా.. డ్రగ్స్: కొంటూ ఎమ్మెల్యే ఫేస్ బుక్ లైవ్

కూరగాయల్లా.. డ్రగ్స్: కొంటూ ఎమ్మెల్యే ఫేస్ బుక్ లైవ్

లుథియానా: డ్రగ్ అమ్మకం అంటే ఓ చీకటి వ్యాపారం. ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా జరిగే బిజినెస్. కానీ పంజాబ్ లో హెరాయిన్ వంటి డ్రగ్స్ కూరగాయల్లా ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయని ఆ రాష్ట్ర ఎమ్మెల్యే ఒకరు మండిపడ్డారు. పంజాబ్ ను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని ఇటీవలే ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

పంజాబ్ లోని లుథియానా నియోజకవర్గానికి చెందిన లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమ్రాన్ జిత్ సింగ్ బైంస్ ఫేస్ బుక్ లైవ్ పెట్టి మరీ డ్రగ్స్ కొనుగోలు చేసి చూపించారు. సోమవారం ఉదయం లుథియానాలోని చీమా చౌక్ ప్రాంతంలో హెరాయిన్ కొన్నారాయన. ఫేస్ బుక్ లైవ్ లో దాన్ని చూపిస్తూ.. డ్రగ్స్ మాఫియాను అంతం చేశామని రాహుల్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూరగాయల మార్కెట్ లో ఆలూ అమ్మినట్లుగా ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పారు. ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియకపోవడం బాధాకరమని అన్నారాయన.

డ్రగ్స్ కొన్న తర్వాత నేరుగా లుథియానా పోలీసు కమిషనర్ ఆఫీసుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే సిమ్రాన్ జిత్ చెప్పారు. దీనిపై ప్రశ్నిస్తే నీళ్లు నములుతున్నారన్నారు. అది హెరాయిన్ అన్న విషయం టెస్ట్ చేసేందుకు సగం పోలీసులకు ఇచ్చి, సగం నేరుగా తాను టెస్ట్ చేయిస్తానని చెప్పారు.

పంజాబ్ లో గత ఎన్నికల్లో డ్రగ్స్ మాఫియా నిర్మూలనే ప్రధాన ఎజెండాగా అన్ని పార్టీలు ఎన్నికలకు వెళ్లాయి. ఆ రాష్ట్రంలో యువత ఎక్కువగా డ్రగ్స్ కు అడిక్ట్ కావడంతో దానిపైనే ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. అక్కడి డ్రగ్స్ మాఫియా, యువత వాటికి బానిస అయిన తీరుపై బాలీవుడ్ లో ఉడతా పంజాబ్ సినిమా కూడా వచ్చింది.

ਚਿੱਟਾ ਸ਼ਰੇਆਮ ਵਿਕਦਾ ਲਾਈਵ ਦੇਖੋ

Simarjeet Singh Bains 发布于 2019年3月10日周日